Chidambaram Thillai Nataraja Temple History | Panchabhuta Linga Information

చిదంబరం దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ ‌కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో, మరియు పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. చిదంబరం అనేది శివుని యొక్క ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ మరియు కాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.
ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉంది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగి యుంది. శైవుల మరియు వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన మరియు చారిత్రాత్మక దేవాలయం ఇది.

చిదంబరం అను పదం, “చైతన్యం” అని అర్ధం వచ్చిన చిత్, మరియు “ఆకాశం” (ఆకాయం నుంచి పుట్టిన) అని అర్ధం వచ్చిన అంబరం ; సూచించిన చిదాకశం, చైతన్యం ఆరోపించబడినట్టి ఆకాశం, దీనినే అన్ని వేదాలు మరియు శాసనాల ప్రకారం, మానవుడు చేరుకోవలసిన అంతిమ లక్ష్యంగా చెప్పబడింది.మరొక సిద్ధాంతం ఏమనగా, ఇది చిత్ + అంబళం నుంచి పుట్టినది. అంబళం అనగా కళలను ప్రదర్శించుట కొరకు ఒక “వేదిక”. చిదాకశం అనేది పరమేశ్వరుని యొక్క చిద్విలాసం లేదా ఆనందం మరియు నటరాజుని చిద్విలాసం లేదా ఆనంద నటన యొక్క చిహ్నాత్మక వర్ణన. చిదంబరాన్ని దర్శిస్తే విముక్తి లభిస్తుందని శైవులు నమ్ముతారు.ఇంకా మరొక సిద్ధాంతం ప్రకారం, “ఆట లేక దైవ నృత్యం” అని అర్ధం వచ్చే చితు మరియు “వేదిక” అని అర్ధం వచ్చే అంబళం నుంచి వచ్చిన చిత్రాంబళం నుంచి ఈ పదం పుట్టినది.

సర్వాలంకృతభూషితుడైన నటరాజుని చిత్రం, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పరమ శివుడు, భరతనాట్య నృత్యం యొక్క దైవంగా వర్ణించినది మరియు శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. పరమ శివుడు నిలుపునట్టి ఈ విశ్వం యొక్క కదలికలు, నటరాజు యొక్క జగత్సంబంధమైన నృత్యాన్ని పోలి ఉంటుంది. ఆలయంలో ఐదు ఆవరణలు ఉన్నాయి.అరగాలూరు ఉదయ ఇరరతెవన్ పొంపరప్పినన్ (అలియాస్ వనకోవరైయన్) క్రీ.శ.1213 లో చిదంబరం లోని శివుని ఆలయాన్ని పునర్నిర్మించాడు.

చిదంబరం యొక్క పురాణం మరియు దాని ప్రాముఖ్యత

చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి మరియు తిల్లై వృక్షాలు – వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా అగాల్లోచ, ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి).తిల్లై వనాలలో కొంతమంది మునులు లేదా ‘ఋషులు’ నివసించేవారు, వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారు మరియు భగవంతుడిని కొన్ని క్రతువులు మరియు ‘మంత్రాల’తో నియంత్రించవచ్చని భావించారు. దేవుడు, ‘పిచ్చతనాదర్’ రూపంలో, ఒక సాధారణ యాచకుడివలే, ఎంతో అందమైన మరియు ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు. అతనిని మోహిని అవతారంలోనున్న అతని సహవాసియైన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు మరియు వారి భార్యలు, ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు మరియు అందమైన ఆతని సహవాసిని చూసి ముగ్ధులౌతారు.ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి, ఋషులు ఆగ్రహిస్తారు మరియు మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన ‘సర్పాల’ను ఆమంత్రిస్తారు. యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు మరియు నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణములవలె ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు, ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా, దాన్ని కూడా శివుడు చీల్చి, ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు.పూర్తిగా విసుగు చెందిన ఋషులు, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని, ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాలకన్ – అను, అజ్ఞానానికి మరియు గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఆమంత్రిస్తారు. పరమ శివుడు ఒక చిరునవ్వుతో, రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి, కదలకుండా చేసి ఆనంద తాండవం చేస్తాడు మరియు ఆతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని మరియు అతను మంత్రాలకు మరియు ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించి, ఋషులు లొంగిపోతారు.

ఆనంద తాండవ భంగిమ

పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.అతని పాదం క్రింద ఉన్నది అజ్ఞానం అను భావాన్ని నటరాజుని పాదం క్రింద ఉంచిన రాక్షసుడుతో సూచిస్తుంది.
చేతిలోని నిప్పు అనగా దుష్టశక్తులను నాశనం చేయునది.
ఎత్తిన చేయి అతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది.
వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది.
చేతిలోని ఢమరుకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది.
ఇట్టి ప్రధాన సంగతులను నటరాజ మూర్తి మరియు దివ్యమైన నృత్య భంగిమ వర్ణిస్తాయి.

ఆనంద తాండవం

ఆదిశేషువు అనే సర్పం, తల్పం వలె మారి విష్ణువుగా సాక్షాత్కరించిన భగవంతుని సేవిస్తుండగా, ఆనంద తాండవం గురించి విని దానిని చూసి తరించవలెనని ఉత్సాహపడతాడు. అంతట భగవంతుడు ఆదిశేషువుని దీవించి, అతనికి యోగ స్వరూపుడైన ‘పతంజలి’ రూపాన్ని ప్రసాదించి తిల్లై అడవులకి వెడలి పొమ్మని, అతను అచిరకాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెబుతాడు.కృత యుగంలో పతంజలి హిమాలయాల్లో తపస్సు చేసి మరొక ముని వ్యాఘ్రపథార్ / పులికాల్ముని ని కలుస్తాడు (వ్యాఘ్ర / పులి అనగా అర్ధం “పులి” మరియు పథ / కాల్ అనగా అర్ధం “పాదం” – అతను దేవుని పూజకు తెచ్చు పూల మీద తుమ్మెదలు వ్రాలుటకు ముందే అనగా వేకువ జాములో చెట్లను ఎక్కి కోయుటకు వీలుగా అతనికి అట్టి పాదాలు మరియు పులి యొక్క కంటిచూపు మాదిరి చూపు వచ్చెనని తెలియజేయు కథ ద్వారా ఆ పేరు అతనికి వచ్చినది). పతంజలి యోగి మరియు అతని యొక్క ఉత్తమ శిష్యుడైన ఉపమన్యు యోగి యొక్క కథలు విష్ణు పురాణం అదే విధంగా శివ పురాణంలో కూడా వర్ణించబడ్డాయి. వారు తిల్లై వనంలోకి వెళ్లి ప్రార్థించిన శివలింగ రూపంలోని పరమశివుడు, ప్రస్తుతం పూజిస్తున్న తిరుమూలాటనేస్వరర్ లోని దేవుడు ఒక్కడే (తిరు – శ్రీ, మూలటనం – స్వయంభువుడైన, ఈశ్వరర్ – ఈశ్వరుడు). పరమ శివుడు, నటరాజుగా అతని యొక్క చిద్విలాస నృత్యాన్ని (ఆనంద తాండవం) ఈ ఇద్దరు మునులకు పూసం నక్షత్రం ఉన్న రోజున ప్రదర్శించాడని పురాణాలు చెబుతాయి.
చిదంబర ఆలయం యొక్క బంగారపు పై కప్పు కలిగిన గర్భ గుడిలో దైవం మూడు రూపాలలో సాక్షాత్కరిస్తాడు:
“స్వరూపం” – సకల తిరుమేని అని పిలిచేటి ఈశ్వరుని మనిషిగా ఆపాదించిన రూపమైన నటరాజస్వామి.
“అర్ధ-స్వరూపం” – చంద్రమౌళేశ్వరుని యొక్క స్పటిక లింగరూపంలోని, అర్ధ- ఈశ్వర మానుష్య శరీరమైన, సకల నిష్కళ తిరుమేని .
“నిరాకార స్వరూపం” – చిదంబర రహస్యం లోని అంతరాళం మాదిరి, గర్భగుడిలోని శూన్య స్థలం, నిష్కళ తిరుమేని .

పంచ భూతాల స్థలాలు

పంచభూతాల యొక్క స్థలాలలో ఒకటైన చిదంబరంలో, ఆకాశం లేదా ఆగయంగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు (“పంచ” అనగా అర్ధం ఐదు, భూత అనగా అర్ధం మూలకం: భూమి, నీరు, నిప్పు, గాలి, మరియు అంతరాళం మరియు “స్థల” అనగా ప్రదేశం).

మిగతావి ఏవనగా:

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం, ఇక్కడ భూమిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
తిరుచిరాపల్లి, తిరువనైకావల్ లోని జంబుకేశ్వర ఆలయంలో, నీరుగా సాక్షాత్కరించిన స్వామిని ఆరాధిస్తారు.
తిరువన్నామలైలోని అన్నమలైయర్ ఆలయంలో, అగ్నిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఆలయంలో, గాలి/వాయువుగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.

Chidambaram Temple Dharshan Timings :

Morning 6.00.a.m to 12.00
Evening 4.00.p.m. to 10.00 night

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *