Best Tour Plan In Ooty , Munnar , Kodaikanal Trip | Temples Guide

కొడైకెనాల్, మున్నార్ మరియు ఊటీ యాత్ర సమాచారం

కొడైకెనాల్  :

భారతదేశంలోని పేరు పొందిన వేసవి యాత్రలలో ఈ కొడైకెనాల్ యాత్ర ఒకటి. తమిళనాడులోని కొడైకెనాల్ తూర్పు కునుమాల్లో నెలకొని ఉన్న అందమైన వేసవి విడిది. ఈ ప్రాంతం తమిళనాడు రాష్ట్రానికి దగ్గరలోనే కలదు. కొడైకెనాల్ దక్షిణానికి 120 కి.మీ. దూరంలోను మదురై కి పడమరగా 64 కి.మీ. దూరంలో పళని ప్రాంతానికి 100 కి.మీ. దూరంలో కలవు.

ఈ ప్రాంతం పూర్తిగా కొండ ప్రాంతం కావున ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తే మధురై నుంచి సుమారు 5 గంటల ప్రయాణం. పళని నుంచి 3 గంటలో , దిండిగల్ ప్రాంతం నుంచి 4 గంటల బస్సు ప్రయాణం చేయడం వల్ల ఈ కొడైకెనాల్ కు చేరుకోవచ్చు.

ఈ ప్రాంతంలో పూర్వం పళని గిరిజన ప్రజలు ఉండే వారు. తమిళుల సంగం సాహిత్యంలో ఈ కొడైకెనాల్ ప్రాంతం ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది. 1845లో అమెరికా మిషనరీలు ఈ ప్రాంతాని హిల్ స్టేషన్ గా అభివృద్ధి చేశారు. ప్రకృతి ప్రేమికులు పూర్వం నుంచే ఇక్కడ నివసించసాగారు.

ప్రస్తుతం పర్యటకులు ఈ ప్రాంతాన్ని “స్విట్జర్ ల్యాండ్ ఆఫ్ ది ఈస్ట్” మరియు “వేసవి స్వర్గం” అని పిలుస్తారు.

Best Tour Plan Ooty , Munnar , Kodaikanal Tour | Temples Guide

చేరుకునే విధానం :

బస్ ద్వారా :

దేశంలోనే అన్నీ ప్రాంతాల నుంచి మొదట తమిళనాడు చేరుకొని అక్కడి నుంచి దిండిగల్ చేరుకోవచ్చు. ప్రైవేట్ వాహనాలలో కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

రైలు ద్వారా :

అన్నీ ప్రాంతాల నుంచి చెన్నై నుండి మధురై వెళ్ళే రైలు ద్వారా కూడా చేరుకొని కొడై స్టేషన్ లేదా దిండిగల్ ద్వారా కూడా చేరుకోవచ్చు.

విమానం ద్వారా :

తిరుచునాపల్లి , లేదా మధురై , లేదా కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్ వాహనల్లో కొడైకెనాల్ కి చేరుకోవచ్చు.

మున్నార్ యాత్ర సమాచారం

భారతదేశంలోని పేరు పొందిన వేసవి యాత్రలలో ఈ మున్నార్ యాత్ర కూడా ఒకటి.  ఈ ప్రాంతం పశ్చిమ కనుమల ఉన్న ఇందుక్కి జిల్లాలో మున్నార్ ప్రాంతం కలదు. ఈ మున్నార్ అనే పదం తమిళ పదం నుంచి వచ్చినది. మూడు నదులు కలిసే సంగమం వద్ద ఉన్న ప్రాంతం కావున మున్నార్ అనే పేరు వచ్చినది అనే కధ కూడా ప్రాచుర్యంలో కలదు.

Best Tour Plan Ooty , Munnar , Kodaikanal Tour | Temples Guide

మున్నార్ చేరుకునే విధానం :

బస్సు మార్గం :

కేరళలోని అన్ని ప్రధాన నగరాల నుండి మున్నారుకు బస్సు సేవలు కలవు. కేరళ మరియు తమిళనాడులోని వివిధ పట్టణాల నుండి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు

రైలు మార్గం :

ఎర్నాకులం రైల్వే స్టేషన్ 130కి.మీ.ల దూరంలో ఉంది. మరియు మధురై రైల్వే స్టేషన్ 135కి.మీ.ల దూరంలో ఉంది. మున్నార్ నుంచి అలూవా రైల్వేస్టేషన్ ద్వారా చేరుకోవచ్చు. మున్నార్ నుంచి అలూవా 110కి.మీ.ల దూరంలో కలదు

విమాన మార్గం :

మున్నార్ కి సొంత విమానాశ్రయం లేదు. కానీ సమీపంలో ఉన్న విమానాశ్రయం 110 కి.మీ.ల దూరంలో కొచ్చి విమానాశ్రయం కలదు. మొదట కొచ్చి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. మధురై నుంచి కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. మధురై నుంచి ఈ ప్రాంతానికి 150 కి.మీ.ల దూరంలో కలదు.

ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు :

మున్నార్ కి దగ్గరలో చాలా చూడవలసిన ప్రదేశాలు కలవు. వాటి గురించి ఈ క్రింద వివరంగా చెప్పడం జరిగినది.

1. కాఫీ లేదా తేయాకు ప్రదర్శనశాల :

మున్నార్ ప్రాంతంలో ప్రప్రధమంగా తేయాకు తోటలకు బాగా ప్రసిద్ది చెందినది. ఇక్కడ ప్రభుత్వమే స్వయంగా తేయాకు మొక్కల పెరుగుదల మరియు ఉత్పత్తి పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వాటి పెరుగుదలకు మరియు ఈ తేయాకు ప్రదర్శనశాలలో అసాధారణమైన యంత్రపరికరాలు ఉన్నాయి. ఈ ప్రదేశం క్రింద ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది.

Best Tour Plan Ooty , Munnar , Kodaikanal Tour | Temples Guide

2. టాప్ స్టేషను :

మున్నార్ నుండి టాప్ స్టేషను 3 కిమీ దూరంలో ఉన్నది. ఈ ప్రాంతం సముధ్రమట్టానికి 1700 మీ ఎత్తులో కలదు. ఈ ప్రాంతం మున్నార్ , కొడైకెనాల్ రహదారిలో ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశం క్రింద ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది.

Best Tour Plan Ooty , Munnar , Kodaikanal Tour | Temples Guide

3. అన్నైరంగల్ :

అనయిరంగల్ మున్నార్ నుంచి 25 కి.మీ. దూరంలో కలదు. ఈ ప్రాంతం మొదట చిన్నకనల్ నుంచి 7 కి.మీ ప్రయాణిస్తే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. తేయాకు మొక్కలతో పాటుగా అనయిరంగల్ ఆనకట్టు కూడా ఉన్నది. అనయిరంగల్ ఆనకట్టు చుట్టూ తేయాకు మెక్కల పెంపకం చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈ ప్రదేశం క్రింద ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది.

 

Anayirangal Dal , Munnar, kerala Road Hindu Temples Guide

4. పల్లివాసల్ :

పల్లివాసల్ మున్నార్ లోని చితీరాపురం నుంచి 4 కి.మీ. దూరంలో కలదు. ఈ ప్రాంతం చుట్టూ పచ్చటి తివాచీ పరిచిన ప్రాంతంగా ఉంటుంది. ప్రజలు ఈ ప్రాంతాన్ని వనభోజన స్థలంగా పిలుస్తారు. ఇది కేరళలోని మొదటి జలవిద్యుత్తు ప్రణాళికకు కేంద్రంగా ఉంది.

Best Tour Plan Ooty , Munnar , Kodaikanal Tour | Temples Guide

5. అనముడి శిఖరం :

ఈ ప్రాంతం కేరళలోని ఎత్తైన పర్వత ప్రాంతం. ఎర్నాకుళంలో ఉన్న అరణ్య మరియు వన్యప్రాణుల అధికారుల అనుమతితో శిఖర అధిరోహణలను చేయవచ్చు.మున్నార్ పట్టణం నుండి దాదాపు 13 కి.మీ. దూరంలో ఉంది, అనముడి (2,695) మీ. ఎత్తులో కలదు.

Best Tour Plan Ooty , Munnar , Kodaikanal Tour | Temples Guide

6. ఎరావికుళం నేషనల్ పార్క్ :

ఈ పార్క్ తేయాకు మొక్కల మరియు పొగమంచు దుప్పట్లలో కప్పబడిన పర్వత దొంతర్ల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి. అధిరోహించటానికి ఇది ఒక ఉత్తమమైన ప్రదేశం. మున్నార్ నుండి 15 కిమీ దూరంలో ఉంది.

Best Tour Plan Ooty , Munnar , Kodaikanal Tour | Temples Guide

ఊటీ యాత్ర సమాచారం

భారతదేశంలోని పేరు పొందిన వేసవి యాత్రలలో ఈ ఊటీ యాత్ర ఒకటి. ఊటీ తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ ప్రాంతం కలదు. ఊటీని ఉదకమండలం అనే పేరు కూడా కలదు. నీలగిరి అనగా “బ్లూ మౌంటైన్స్” అని అర్దం. వారాంతపు సెలవులలో దర్శించే ప్రదేశాలలో ఈ ప్రాంతం ఒకటి.

 Hindu Temples Guide

ఊటీ సముద్ర మట్టానికి 2240 మీ. ఎత్తులో ఉన్నది. ఇక్కడ తేయాకు మొక్కల పెంపకం తో పాటు ఎతైన కొండలు ఇక్కడ బాగా ఆకర్శిస్తాయి. ఈ ప్రాంతాన్ని చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చి 18వ శతాబ్ధంలో ఆంగ్లయుల చేటులోకి వెళ్ళినది అని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వారు.

ఊటీ కి చేరుకునే విధానం :

బస్ మార్గం :

దేశంలోని అన్నీ ప్రధాన నగరాల నుంచి ఊటీ కి బస్ లు కలవు. తమిళనాడు నుంచి ప్రైవేట్ వాహనాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటాయి.
ఊటీ కి చేరుకునే అన్నీ ప్రధాన రహదారుల సమాచారం.
మద్రాస్ కు 535 కిమీ. (సేలం ద్వారా)
కోయంబత్తూర్ కి 89 కిమీ
కూనూర్ కు 18 కిమీ. (వయా గూడలూరు)
మైసూర్ కు 160 కిమీ.
కాలికట్ 187 కిమీ.
బెంగుళూరు 290 కిమీ.
కొచ్చిన్ కు 281 కిమీ. (కోయంబత్తూర్, పాలక్కాడ్ ద్వారా)

రైలు మార్గం :

ఊటీకి 40కి.మీ.ల దూరంలో ఉన్న మెట్టుపాల్యం అనే రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా ఊటీ కి చేరుకోవచ్చు. మెట్టుపాల్యం నుంచి ఊటీ కి సుమారు 5 గంటల ప్రయాణం.

Hindu Temples Guide

విమానా మార్గం :

సమీప విమానాశ్రయం కోయంబత్తూర్ (100 కి.మీ.) కోయంబత్తూర్ బొంబాయి, బెంగళూరు మరియు చెన్నైలకు అనుసంధానించబడి ఉంది.
ఊటీలో చూడవలసిన ప్రదేశాలు :

1. దొడ్డబెట్ట శిఖరం :

దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం. ఇది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో విస్తరించి ఉన్న నీలగిరి పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమల్లో అంతర్భాగం. దొడ్డబెట్ట శిఖరం సుమారు 2,637 మీటర్ల (8640 అడుగులు) ఎత్తును కలిగి ఉంది. ఈ శిఖరం ప్రసిద్ధ వేసవి విడిది అయిన ఊటికి 9 కి.మీ.ల దూరంలో ఉంది. ఊటి నుండి కోటగిరికి వెళ్ళు మార్గంలో ఈ శిఖరం కనిపిస్తుంది. ఊటిని సందర్శించే ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా చూసే ప్రదేశాలలో దొడ్డబెట్ట ఒకటి.

2. బొటానికల్ గార్డెన్.
3. కాఫీ తోటలు.
4. పర్వత రైల్ మార్గం.
5. జాతీయ పార్క్.
6. రాతి గృహం.
7. ఊటీ సరస్సు.
8. ఊటీ బోట్హౌస్.
9. మైనపు ప్రపంచం

 

Best Tour Plan Ooty , Munnar , Kodaikanal Tour | Temples Guide

 

Keywords :  Best trip In Summer, Kodaikenal Trip, Munner Trip, Ooty Trip, Ooty near places, Munner near places to visit, Near places to visit in Kodaikenal, Bus, Train, By Air Details, Hindu Temples Guide.

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *