Best Temples To Visit In Chennai | Hindu Temples Guide

చెన్నై ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ చూడవలసిన ఆలయాలు

1. శ్రీ కపాలీశ్వర దేవాలయం :

శ్రీ కపాలీశ్వరుడి కోవెల భారత దేశ తమిళనాడు రాష్ట్ర రాజధానియైనచెన్నై లోని మైలాపూర్ లో కలదు. ఇచ్చటి శివుడి పేరు కపాలీశ్వరుడు (లేక కపాలి మాత్రమే). అమ్మవారి పేరు కర్పకాంబాళ్. మైలాపూర్ అను ప్రాంతము తిరుమయిలై అనియు కపాలీశ్వరము అనియును పిలువబడుచున్నది. ఇచ్చట పార్వతీదేవి నెమలి రూపములో శివుని గూర్చి ఘోర తపంబొనర్చెననియు అందువలన ఈ ప్రాంతమునకు మైలాపూర్ లేక తిరుమయిలై అను పేరు వచ్చెనని ఐతిహ్యము. అరవ భాషయందు “మయిల్” అనిన “నెమలి” అని అర్థము. ఇచ్చట కపాలిశ్వరునకును కర్పగాంబాళ్ అమ్మవారికిని వెవ్వేరు సన్నిధులు గలవు. ఈ ఆలయం క్రింద ఫోటో లో చూపించిన విధంగా ఉంటుంది.

Best Tour Planning in Chennai | Hindu Temples Guide

శ్రీ కపాలీశ్వర ఆలయం  సమయం :

ఉదయం 5.00  నుండి 12.00 P.M

సాయంత్రం 4.00 నుండి 9.00 P.M

2. శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం :

కామాక్షి అమ్మవారి పేరులో “కా” అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి అని అర్ధం. కామాక్షి అంటే లక్ష్మిని సరస్వతి ని కనులుగా కలిగినది. అమ్మవారికి ఎదురుగా ఎత్తులో అంటే మన వెనకాల ఉత్సవ మూర్తి ఉంటుంది.  మీరు దర్శనం అయ్యాక ముందుకి నడిచిన తరువాత ఒక నాలుగు మెట్లు ఎక్కి పైకి వెళ్తే  పై నుంచి అమ్మవారి దర్శనం అద్భుతంగా ఉంటుంది.

ఇప్పుడు మీకు ఎదురుగా కామాక్షి అమ్మవారు.. కుడిచేతివైపు ఉత్సవ మూర్తి.  ఎడమవైపు బంగారు కామాక్షి అమ్మవారిని ఉంచిన చోటు.  తలపైకి ఎత్తి చూస్తే విమాన కామాక్షి అమ్మవారు కనిపిస్తారు. మీరు అమ్మవారికి పూజలు చేయించాలి అనుకుంటే అక్కడున్న పూజారులని సంప్రదించాలి. ఈ ఆలయం క్రింద ఫోటో లో చూపించిన విధంగా ఉంటుంది.

Best Tour Planning in Chennai | Hindu Temples Guide

కాంచీపురం శ్రీ కామాక్షి అమ్మ ఆలయం సమయం :

ఉదయం 5: 30 నుండి 12: 15 PM

సాయంత్రం 4: 00 నుండి 8: 15 PM

(శుక్రవారం రోజున 9:30 PM మరియు పౌర్ణమి రొజున  రాత్రి 10:30 వరకు)

3. శ్రీ పురం స్వర్ణదేవాలయం :

ఈ దేవాలయములో గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు. ప్రతి శుక్రువారం గుడిని అందంగా అలంకరిస్తారు. శ్రీపురం లోని బంగారు గుడి శ్రీపురం స్వర్ణదేవాలయం ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు కు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది.

చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని నిర్మాణానికి నారాయణి అమ్మ అనే స్వామి నేతృత్వం వహించాడు. ఆయన శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యం లోనిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం మొత్తం నక్షత్రం ఆకారం గల ప్రాకారంతో ఆవరించబడి ఉంటుంది. ఈ ఆలయం క్రింద ఫోటో లో చూపించిన విధంగా ఉంటుంది.

Best Tour Planning in Chennai | Hindu Temples Guide

శ్రీ పురం ఆలయ పూజా వివరాలు :

ఆలయం ప్రతి రోజు ఉదయం 4.00 తెరుచుకుంటుంది మరియు రాత్రి 8.00 వరకు.
అభిషేకం – ఉదయం 4.00 నుండి 8.00 వరకు
సాధారణ దర్శన వేళలు – ఉదయం 8 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు
హారతి సేవా – ప్రతి రోజు సా 6.00 నుండి 7.00 వరకు.

4. శ్రీ తిరువణ్ణామలై లేదా అరుణాచలం :

అరుణాచలం లేదా “అన్నామలై” తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ – ఎర్రని, అచలము – కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో ” తిరువణ్ణామలై ” అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము.

అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము  కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. ఈ ఆలయం క్రింద ఫోటో లో చూపించిన విధంగా ఉంటుంది.

చెన్నై నుండి దూరం :

చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు (C.M.B.T) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరుటకు 4-5 గంటల సమయం పడుతుంది. ఈ ఆలయం క్రింద ఫోటో లో చూపించిన విధంగా ఉంటుంది.

Best Tour Planning in Chennai | Hindu Temples Guide

శ్రీ తిరువణ్ణామలై లేదా అరుణాచలం ఆలయం సమయం :

తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు.
సాయంత్రం 3.45 – 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు.
పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు.

5. మహాబలిపురం :

మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది. మహాబలిపురం తమిళ భాషలో మామల్లపురం (மகாபலிபுரம்) (Mamallapuram) అని పిలుస్తారు. ఈ పట్టణంలో ఉన్న తీరం వెంబడి ఉన్న దేవాలయం ప్రపంచంలో యునెస్కో వారి చేత సంరక్షించ బడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి.

7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురం వెళ్ళటానికి చెన్నై కోయంబేడునుంచి బస్సులు ఉన్నాయి. అక్కడినుంచి మహాబలిపురానికి ఒక గంటన్నర రెండు గంటల్లో చేరుకోవచ్చు. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరంలోనే వుంటాయి. ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు లేదా ఆటోలు దొరకుతాయి. చెన్నై నుంచి 55 కిమీ దూరం లో మహాబలిపురం ఉంది. ఇక్కడ శిల్పకళా సంపద అద్భుతం. ఈ ఆలయం క్రింద ఫోటో లో చూపించిన విధంగా ఉంటుంది.

Hindu Temples Guide

Shore Temple Timings :

Weather : In Winter 26° C, In Summer 39° C,

Ideal Time: 1-2 hrs

Open Time: 6:00 AM – 5:00 PM

Cost: Indians: INR 20,
Foreigners: INR 350,
Children (below 15 years): Free.

 

Keywords : Best temple visting in Tamil Nadu, Best Planning to visit  Kapaleshwar Temple, Kanchipuram, Vellore, Tiruvannamalai, Pondicherry, Mahabalipuram Temples Timings, Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *