Angapradikshana Tirumala Temple Details Timings, Ticket Booking , Guidelines

Angapradikshana At Tirumala Information

తిరుమలలో అంగప్రదక్షణ చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. శుక్రవారం తప్పించి అన్ని రోజులు అంగప్రదిక్షణ చేస్తారు. జీవితం లో ఒక్కసారి అంగప్రదిక్షణ చేసిన జీవితాంతం ఆ అనుభూతిని మరచిపోలేము. టికెట్ ఫ్రీ గానే ఇస్తారు. మద్యాహ్నం 1 గంట నుంచే టికెట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. 750 టికెట్స్ మాత్రమే ఇస్తారు , స్త్రీ పురుషులు ఇరువురు అంగప్రదిక్షణ చేస్తారు. మరిచిపోకండి తడిబట్టలతో లైన్ లలో నిలబడాలి, పుష్కరిణి లో స్నానం చేసి మీరు వెళ్ళాలి. టికెట్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. C.R.O ఆఫీసు కి ఎదురుగా ఇస్తారు. రాత్రి 1 am గంటకు లైన్ లో నిలబడాలి. 3.30 am అంగప్రదిక్షణ చేయిస్తారు.
అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ..టికెట్స్ ఇచ్చేటప్పుడు మీరు మీ ఆధార్ కార్డు చూపించాలి.. ఇంతక ముందు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు ఈ మధ్యనే కొత్తగా పెట్టారు. టికెట్ తీస్కునేటప్పుడే 10/- తీస్కుని లడ్డు టోకెన్ అదికూడా టికెట్ పైన వచ్చేలా చేశారు.
అంగప్రదిక్షణ అయినతరువాత స్వామి వారి దర్శనం చేయిస్తారు. సాంప్రదాయ దుస్తుల్లో అంగప్రదిక్షణ చెయ్యాలి .. మామోలు ప్యాంటు కూడా అనుమతినిస్తున్నారు.. బెల్ట్ అనుమతించరు.
గురువారం అంగప్రదిక్షణ టికెట్స్ ఇవ్వరు.. శుక్రవారం అంగప్రదిక్షణ ఉండదు.

Angapradikshana Tickets Timings : Staring form 1 am
Tickets : 750 only
Darshan Timings : Next day Morning
Ticket Cost : Free
Ticket Counter : Opposite C.R.O office

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *