Accommodation in Varanasi | Andhra Ashramam Cycle Swamy Phone Numbers

వారణాసి యాత్ర వసతి వివరాలు

వారణాసి యాత్ర జీవితం లో ఒక్కసారైనా వెళ్లాలని భక్తులు భావిస్తారు. ఆ రోజుల్లో కాశి కి వెళ్లినవాడు కాటికి వెళ్ళినట్టే అనుకునేవారు, ఎందుకంటే సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం తో కాశి వెళ్లడం కాటికి వెళ్లడం తో పోల్చేవారు. మనం అదృష్టవంతులం వెళ్ళాలి అనుకుంటే చాల సులువుగా వెళ్ళిరాగాలం ఆదేవుడి అనుమతి కూడా కావాలి అనుకోండి. 

వారణాసి లో ముఖ్యమైన సమస్య  మనకి హిందీ రాకపోవడం , దానికి తోడు తెలుగు తెల్సినవారే మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉండటం. అదేమిటి తెలుగు వచ్చినవాళ్లు మోసం చేయడం అనుకుంటున్నారా వివరాల్లోకి వెళ్తే . 

 

చాల పుణ్యక్షేత్రాలలో ఆంధ్ర ఆశ్రమాలు మనకి కనిపిస్తాయి. నిజానికి ఈ ఆంధ్ర ఆశ్రమాలు ఒక ఆర్గనేషన్ వాళ్ళు నడపడం లేదు ఎవరో ఒకసారి ఆయా క్షేత్రాలలో ఆంధ్ర ఆశ్రమం అనే పేరుతో ఏర్పాటు చేసి భక్తులకు సేవ చేస్తున్నారు. తెలుగు వారు ఎక్కడికెళ్లినా ఆంధ్ర ఆశ్రమం పేరుకనిపిస్తే మనవాళ్లే అనే ఫీలింగ్ ఉంటుంది. ఉచితం అని కాకపోయిన తెలుగు వచ్చు కదా ఎమన్నా సహాయపడతారు అనే ఫీలింగ్. 

 

వారణాసి లో కూడా ఆంధ్ర ఆశ్రమం ఉంది. కాశి మొత్తానికి ఒక్క ఆశ్రమమే ఉంది. ఈ ఆంధ్ర అనే పేరే మనం మోసపోవడానికి కారణం అవుతుంది. తెలుగు తెల్సిన కొందరు ఆంధ్ర ఆశ్రమం అని బోర్డు పెట్టుకుని , ఆటో వారితో మాట్లాడుకుని ఎవరైనా తెలుగు వాళ్ళు ఆంధ్ర ఆశ్రమం అని అడగగానే ఈ ఆశ్రమానికి నిజానికి అది లాడ్జి తీసుకురావడం , రాగానే వారిదగ్గర డబ్బులు వసులు చేయడం చేస్తుంటారు. కొత్తవారు కాబట్టి మీకు నిజం తెలియడం కాస్త ఆలస్యం అవుతుంది . డబ్బులు అన్ని ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఏమి చేయలేరు . 

 

వారణాసి లో మీరు ట్రైన్ దిగిన తరువాత ఆటో వారితో మాట్లాడుకుని  సైకిల్ స్వామి ఆశ్రమానికి వెళ్తే సైకిల్ స్వామి ఆశ్రమం , ఆంధ్ర ఆశ్రమం రెండు పకప్రక్కనే ఉంటాయి . ఈ రెండు ఆశ్రమాలలో ఎక్కువ తెలుగు వారు ఉంటారు. ఆలయం కూడా దగ్గరే ఈ రెండు ఆశ్రమాలతో పాటు మరికొన్ని నెంబర్ లు ఇచ్చాను చూడండి . మీకు తెల్సినవాటిని కామెంట్ చేయండి . 

Sri Ramataraka Andhra Ashramam Address:

Sri Rama Taraka Andhra Ashram

B 14/92,
Varanasi H O,
Varanasi – 221002,
Manasorovar




Phone Number : (91)-542-2450418

Sri Sringeri Shnkar Math

,B-14/111 Kedargrghat,Varanasi, Uttar PradeshPIN Code – 221 001
Telephone Number : 0542- 2452768
Branch in charge : Ramakrishna Prasad–

Sri Kanchi Kamakoti Peetam

Sri Sankara MuttVaranasi
Branch,B 4/7,
Hanuman Ghat,
Varanasi – 221001–
Kumara Swamy Mutt , Near Kedar Ghat

Tel No. 0542 2454064

Keywords : Varanasi Accommodation Phone numbers , VARANASI  Tour, Cycle Swamy Ashramam, Varanasi Andhra Asramam Phone Numbers, Varanasi Tour Packages .

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

1 Response

  1. Kiran says:

    How much cost in 12days with Andhra food

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *