Skip to main content

Dharma Sandehalu Tulasi - తులసికి సంబంధించిన అన్ని విషయాలు

తులసీ పత్రాలను ఏ సమయంలో తాకకూడడు, కోయకూడడు.?

జ). తులసీ పత్రాలను అమావాస్య, పూర్ణిమ, రోజులలోను ద్వాదశీ నాడు, సూర్య సంక్రమణా దినములు లోను , మధ్యాహ్న కాలంలో, రాత్రి వేళల్లో,ద్విసంధ్యల లోనూ , కోయకూడడు.

ఓం అశౌచ సమయములలోనూ, శరీరమునకు నూనె రాసుకుని ఉన్న సమయాల్లోనూ, స్నానం చేయకుండా ఉన్నప్పుడు, మరియు రాత్రి ధరించిన వస్త్రాలతోనూ తులసీ పత్రములు కోయడం, వాటిని తాకడం చేయకూడదు.
పై నియమాలు ఉల్లంఘించి తులసీ పత్రాలను కోసిన, తాకినా నా శిరసును ఖండించినట్లే అని స్వయంగా శ్రీహరి చెప్పాడు.

 మరణాసన్న కాలంలో చనిపోయేవారి చేత తులసీ జలం ఎందుకు త్రాగిస్తారు.

జ.)మృత్యు సమయంలో ఎవరి ముఖమందు (నోటిలో) తులసీ దళాలతో కలిసిన జలం ఒక చుక్కైనా ఉంటుందో వారు నిశ్చయముగా రత్న విమానం అధిరోహించి విష్ణులోకం చేరెను. ఏ దేహదారి మరణాసన్న కాలమున తులసీ జలం సేవించిన వారి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరెను.

తులసి యొక్క మహత్యం, గొప్పదనం చెప్పగలరు ?

జ.) తులసికి శ్రీహరి ఇచ్చిన వరాలు

1.తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు, పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి.
2.తులసీ పత్రము యొక్క స్పర్శ కలిగిన జలములో స్నానం చేసిన వారు సర్వ తీర్థములందు స్నానం చేసినవారు సమస్త యజ్ఞములకు దీక్ష వహించిన వారగుదురు.
3.శ్రీహరికి ఎన్నో వేల వేల అమృత బాండాలు సమర్పించిన కలగని తృప్తి ఒక తులసీ దళం సమర్పించిన శ్రీహరి కి ఎంతో తృప్తి కలుగుతుంది.
4.పదివేల గోవులను దానం చేసిన మానవులకు ఎంత ఫలము కలుగుతుందో అంత ఫలితం ఓక తులసీ దళం దానం చేస్తే కలుగుతుంది.
5.ఏ దేహదారి మరణాసన్న కాలమున తులసీ జలం సేవించిన వారి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరెను.
6.ఏ మనుష్యుడు నిత్యం భక్తి పూర్వకంగా తులసీ తీర్థం స్వీకరించునో వానికి గంగాస్నాన ఫలమ లభించును. అతను తప్పకుండా జీవన్ముక్తుడు కాగలడు.
7.ఎవరు ప్రతి నిత్యం శ్రీహరికి తులసీదళం సమర్పించి భక్తితో పూజించునో వానికి లక్ష అశ్వమేధములు చేసిన పుణ్యము నిశ్చయముగా లభించును.
8.ఎవరు తులసీదళములను హస్తమందుంచుకుని తులసీ పత్రాలను తన శరీరంపై వేసుకుని పుణ్యతీర్థములలో ప్రాణత్యాగం చేస్తారొ వారు నిస్సందేహంగా విష్ణు లోకం వెళ్ళగలరు.
9.తులసీ కాష్ఠముచే నిర్మింపబడిన మాలను కంఠం నందు ధరించిన వారు అడుగడుగునా అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారు.
10.ఎవరు తులసీ దళములను హస్తమందుంచుకుని ప్రతిజ్ఞ చేసి దానిని నెరవేర్చడో వారు సూర్యచంద్రులు ఉన్నంతవరకు కాలసూత్రమను నరకమున పడి నానా యాతనలు అనుభవించును.
11.ఎవరు తులసీ దళాలను చేతియందు ఉంచుకుని అసత్య ప్రతిజ్ఞ చేస్తారొ వారు పద్నాలుగు ఇంద్రుల ఆయుః పర్యంతం కుంభీపాక నరకం అనుభవిస్తారు.

తులసీ దళాలు ఎన్నిరోజులు వరకు వాడవచ్చు?
జ.) శ్రాద్ధ,వ్రత,దాన,ప్రతిష్టాది కార్యములందు, దేవతార్చనలయందు తులసీ దళాలు వాడిపోయిన ను, శుష్కించినను మూడు రాత్రుల కాలం వరకు  పవిత్రంగా వాటిని ఉపయోగించవచ్చును.

ఇంట్లో తులసి మొక్క ఎటువైపు ఉండాలి?
నిదుర లేవగానే తులసి కనపడే విధంగా ఉండాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. నిత్యం దీపారాధన చేసే తులసికోట ముఖ్యంగా తూర్పువైపు ఉంటే మంచిది. తులసి గడపకు ఎదురుగా ఉండం వల్ల దృష్టి దోషాలు పోతాయి. కానీ బయటి వ్యక్తులు ఎవరూ తులసిని తాకకుండా ఉండేటట్లు చూసుకోవాలి. తులసి ఎటువైపు ఉన్నా మంచిదే. కానీ ప్రధానంగా  పూజలందుకునే తులసి గడపకు అభిముఖంగా ఉండేటట్లు వేసుకుంటారు. ఇంటి దొడ్డిలో వేసుకుంటే దొడ్డి తలుపు తీయగానే కనిపించే విధంగా వేసుకోవచ్చు ఉత్తరముఖంగా గడప ఉండేవారు ముందున్న కాలీ ప్రదేశంలోనూ మొక్కను ఉంచుకోవచ్చు

ఎటువంటి కారణాల వల్ల తులసి లాడిపోతుంది
మట్టిలో దోషం ఉన్నా ఎండ సరిగ్గా తగలకపోయినా నిర్దిష్ట సమయానికి నీరు పోయకపోయినా వాడిపోతుంది
బహిష్టు మైల సమయాలలో తులసి దగ్గరకు వెళ్ళినా తులసిని తాకినా తులసి వాడిపోతుంది
ఇంట్లో ఆడవాళ్ళు బాధపడుతున్న, హింసకు గురవుతున్న ఆఇంట్లో తులసి వాడిపోతుంది
ఉతికిన బట్టలు ఆరవేసిన నీరు తులసికి తగిలిన తులసి ఉండే కుండీలో వేరే మొక్కలు పెరిగిన తులసి వాడిపోతుంది

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.