శ్రీ కుక్కుటేశ్వర స్వామి యాత్రలో నా అనుభవాలు, పాదగయా క్షేత్రము, పిఠాపురం(10వ శక్తీ పీఠం) | D.Balnarsing rao

శ్రీ కుక్కుటేశ్వర స్వామి యాత్రలో నా అనుభవాలు, పాదగయా క్షేత్రము, పిఠాపురం(10వ శక్తీ పీఠం) :

నా పేరు డి. బాల్ నర్సింగ్ రావు. నేను హైదరబాద్ లో నివసిస్తూ ఉంటాను. గత నెల 14/09/2018 నా నేను మా అన్నయ్యగారి ఇంటికి వెళ్లినప్పుడు రెండు రోజులు తరువాత 16/09/2018 ఆదివారం రోజున నేను మరియు మా అన్నయ్య ఈ ఆలయాని దర్శించాము. ఈ ఆలయం చాలా పెద్దది గాను మరియు ఆలయం లోకి ప్రవేశించగనే సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వామి నివాస స్థానంలో ఉన్న అనుభూతి కలిగినది.

ఆలయ చరిత్ర :

శివుని భార్య అయిన సతీదేవి దక్షయాజ్ఞము నందు తనువు చాలించగ శంకరుడు దక్షయజ్ఞమును విధ్వంసం చేసెను.  సతీదేవియందు గల అనురాగంతో ఆమె మృతదేహమును భుజముయందు ధరించి విరాగి గా సంచారం చేయుచుండెను. సంహర్త అయిన శంకరుడు తన కార్యం నెరవేర్చకపోవుటచే భూమి భారం పెరిగిపోయినది. తారకాది రాక్షసుల తాకిడి పెరుగగా ఆదిపరాశక్తి ఆదేశం తో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ మృత కాలేబరము ఖండించగా 108 శక్తీ పీఠంలుగా రూపొందినవి. అందు 101 విశేషము గాను , 52 ముఖ్యముగా ,18 ముఖ్యాతి ముఖ్యముగాను సతీ దేవి పీఠభాగం (పిరుదులు) పడినచోటు పీఠాపురంగాను  ఇచ్చటన్నున అమ్మవారు  పీఠభాగమునకు ఆధిష్టాన దేవత పీఠంబికాగాను , పురుహేతుదను పేరుగలన ఇంద్రుడు పూజించుటవలన పురుహూతిక దేవి ప్రసిద్ధి చెందినది. ఇచ్చట గల శక్తీ ఆలయం చుట్టూ 18 శక్తీ పీఠములు దర్శించుట విశేషము. ఈ అమ్మవారిని సేవించువారికి స్త్రీలకి సౌభాగ్యము – దాంపత్య సౌఖ్యము , సంతానప్రాప్తి – శత్రుబాధ నివృత్తి కలుగును. వివాహం కావల్సిన వారికి వివాహము జరుగును. ఈ ఆలయం లో  శుక్రవారం రాహుకాల పూజ విశేషమైనది. శో|| లంకాయాం శాంకరీదేవి – కామాక్షి కాంచీకాపురే ! ప్రద్యుమ్నేశృంఖలేదాఏవి – చాముండా క్రాంచపట్టణే || అలంపురే జోగులాంబా – శ్రీశైలే భ్రమరాంబికా |కోటాహుపు మహాలక్ష్మీ – మాహుర్యే ఏకవీరికా | ఉజ్జాయిన్యాము మహాకాళీ – పీఠాయాం పురుహూతికా || ఓడాణ్యేగిరిజాదేవి -మణిక్యెదక్ష వాటికా| హరిక్షేత్రేకామరుపీ – ప్రయాగేమాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీదేవి – గయామంగళ్యగౌరికా | నారణాస్యాము విశాలాక్షి – కాశ్మీరేత్తు సరస్వతి||

 

ఆలయం యొక్క ముఖ ద్వారం

పీఠాపుర క్షేత్రం ప్రాశిస్థ్యము :

ద్వాదశ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేర్గొన ఈ పీఠాపురం పురాణేతిహాస ప్రసిద్దం దేశ ప్రఖ్యాతమైన త్రిగయాలోను ” పాదగయా ” శివక్షేత్రాలలో  ” కుక్కుటేశ్వరం” పంచమాధవములలో ” కుంతీమాధవము ” శ్రీ మహాదేవి అష్టాదశ పీఠలలోనూ “పురుహూతిక ” పీఠం ,ఇలాదేవి, శివ,విష్ణు,దత్త,గయా క్షేత్రమైన ఈ పిఠికాపురం. పుణ్యక్షేత్రాలలో సుప్రసిద్ధం ఈ పీఠాపట్టణం (పీఠికాపురం) దైవ నిర్మితమైనదని భీమేశ్వర పురాణంలో శ్రీనాధ కవి సార్వభౌమూడు ఇల్లా వర్ణించాడు.

“కుంతీ మాధవ దెవునకు విశ్రాంతి ప్రదేశంబును ,

హుంకారిణి మహాదేవికి విహారసంకేత భవనంబును ,

పీఠాంబిక లక్ష్మీ కాటకూటంబును ,హేలాసానికి హాల

పానగోష్టి మంటపంబు ననందగీ భూతభేతాళ ఢాకినీ

ఫెత భైరవ వ్రాత నిర్మిత ప్రకారవప్రహట్టకుట్టిమంబగు”

పీఠాపట్టణం కు వ్యాస మహార్షి తన శిష్య గణంతో అటువంటి పీఠాపురం వచ్చినట్లు స్కాందపురాణాలో భీమఖండమునందు వివరించారు.

ఆలయ కోనేరు చాలా విశాలంగా ఉంటుంది:

పాదగయా క్షేత్రము మహాత్యము :

త్రిగయా క్షేత్రములలో పాదగయ క్షేత్రం విఖ్యాతమైనది. ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన దివ్య శైవ క్షేత్రము. గయాసుర సంహారం అనంతరం శివుడు కోడి రూపం (కుక్కుటం) స్వయంభూ మూర్తిగా శ్రీ కుక్కుటేశ్వరునిగా వెలిసినాడు. పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు విష్ణుభక్తుడై విష్ణుమూర్తి అనుగ్రహంతో భూమండలంలో గల అన్నీ పుణ్య క్షేత్రములకన్న తన దేహం పవిత్రమైనదిగా వరం పొందినాడు. ఎంత పాపాత్ములైన గయాసురుని దర్శించిన స్మర్శ చేసిన వారు పాపముల నుండి విముక్తులై ఉత్తమ గతులను పొందేడివారు. గయాసురుని శరీరం నుండి వచ్చు గాలి సోకిన క్రిమికీటకాలు కూడా స్వర్గాన్ని పుణ్యలోకములు పొందిరి అట్టి గాయాసురుడు అనేక అశ్వమేధాది క్రతువులు చేయుట వలన ఇంద్ర పదవి పొంది త్రిలోకాధిపతి అయినాడు. అప్పటి వరకు అధికారంలోనున్న ఇంద్రుడు పదవిచ్య్తుడై మరలా భూలోకంనకు వచ్చి పదివేల సం|| బ్రహ్మ , విష్ణు, మహేశ్వరులను గూర్చి తపస్సు చేసినాడు. ఇంద్రుని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యేక్షమై వరం కోరుకొన్నారు. అప్పుడు ఇంద్రుడు గాయాసురుని పరిపాలనలో అతనౌ ధర్మాత్ముడైనప్పటికి అనుచరులైన రాక్షసుల పిడవలన మునులు – ప్రతివ్రతలు హింసిపబడుతున్నారని అందువలన యజ్ఞంగా కృతువులు లేక భూమి ఎడారిగా మారినది అని మరలా తనకు ఇంద్రపదవి ఇప్పించమని కోరినాడు.

ఆలయం యొక్క రాజద్వారం :

దేవకార్యార్ధము త్రిమూర్తులు బ్రహ్మణ వేషం ధరించి గయాసురుని వద్దకు వెళ్ళినారు.  గయా సురుడు వారిని పూజించి వారు  వచ్చిన కార్యం తెలుపమని కోరేను. వారి కొరకు తన శరీరమైన ఇస్తానని వాగ్ధానం చేసెను. అంతట త్రిమూర్తులు లోక కళ్యాణర్దము ఒక యజ్ఞము  చేయదలచినాము. యజ్ఞ వేదికగా పవిత్రమైన గయా సురుని దేహము ఇమ్మని కోరినారు. పవిత్రమైన యజ్ఞం తన దేహం ఉపయోగపడునను తలచి అతడు అంగీకరించేను. యజ్ఞం పూర్తి అగువరకు గయసురునిశరీరం కదిలించకుండా ఉండాలని ఒకవేళ గయాసురుడు కదిలినచో అతనిని వధిస్తానని షరతు విధించినాడు. గయా సురుడు దేహం పై ఒక కోడి కూత ఘమున(బ్రహ్మముహూర్త కాలం) ఏడురోజులు యజ్ఞం చేయుటకు ప్రారంభించిరి. ప్రతి రోజు కోడి కూత వినుచు తన దేహం కదపకుండ గయా సురుడు నిశ్చలంగా రోజులు లేఖించు చునాడు. ఈ విషయం గ్రహించిన ఇంద్రుడు ఏదో ఉపాయం పన్ని ఎలాగైనా గాయాసురుని సంహరించమని ప్రార్దించాడు.

అమ్మవారి ఆలయ ప్రాంగణం :

అంతా ఈశ్వరుడు అర్ద రాత్రి సమయాన కోడి రూపము ధరించి “కొక్కురోకో” అని కుక్కుటారావం చేసినాడు. శివ మయ తెలియని గయా సురుడు యజ్ఞం పూర్తి అయినాది అని తన దేహము ఆనందంతో కదిలించినాడు. గయా సురుని వల్ల యజ్ఞం భగ్నము అయినది. అందుకు కోపించిన త్రిమూర్తులు గయా సురుని సంహరిస్తామని చెప్పి చివరి కోరిక కోరుకోమనిరి . చివరి కోరికగా తన దేహంలో ముఖ్యమైన మూడు భాగములు మూడు గయా క్షేత్రములు అగునట్లు ఆ క్షేత్రములలో మానవులు పితరులను ,ఉద్దేశించి ఆన్నదాన , పిండ ప్రదాన తర్పణములా వలన వారి పితరులకు మళ్ళీ పుట్టుక లేని బ్రహ్మ పదముకలుగాలని కోరేను. అట్లే త్రిమూర్తులు వరం ఇచ్చిరి. గయా సురుని పేరున త్రిగయక్షేత్రం ఏర్పడినవి.

గయా సురుని శిరస్సు గల చొట్టు బీహారు రాష్ట్రంలోని శిరోగయ అచ్చట విష్ణుమూర్తి ప్రధాన దైవము. మంగళగౌరి శక్తీ పీఠం ,నాభి గయా ఒరిస్సాలో జాజిపూర్ లో ఉన్నది. అచ్చట బ్రహ్మ యజ్ఞ వేదిక రూపంలో ఉన్నాడు. గిరిజా దేవి శక్తీ పీఠం. గయాసురుని పాదములున్న ఈ క్షేత్రము “పాదగయా” క్షేత్రముగాను గయాసురుని వధించుటకు కోడి రూపము ధరించిన పరమేశ్వరుడు లింగ స్వరూపము శ్రీ కుక్కుటేశ్వర స్వామి గాను శ్రీ పురుహూతిక దేవి శక్తీ పీఠంగాను ఈ క్షేత్రంగా విరాజిల్లుతునది.

ఆలయ దర్శన వెళ్ళలు :

5:00 am to 12:00 pm తిరిగి 4:00 pm to 9:00 pm

చేరుకునే మార్గలు :

రాజమండ్రి నుంచి పీఠాపురం కి కొన్ని రైలు బయలుదేరుతాయి. రైల్వే స్టేషన్ నుంచి శ్రీ పురుహూతిక దేవి ఆలయంకి 1.5 kms దూరంలో కలదు. సామర్ల కోట నుంచి పీఠాపురం 10 kms దూరం కలదు. సామర్ల కోట నుంచి ఆటొలు , బస్ లు వెలుతాయి.

చుట్టూ పక్కల చూడవలసిన దేవాలయాలు :

కుక్కుటేశ్వర స్వామి ఆలయం , ఈ ఆలయంలోనే దత్తత్రేయుని స్వయంభూ  విగ్రహం కలదు. శిరిడీ సాయిబాబా ఆలయం , కాలభైరవ స్వామి ఆలయం, కుంతి మాధవ స్వామి ఆలయం , శ్రీ సీతారామలయం , నవగ్రహాల ఆలయం , కాశీ అన్నపూర్ణ దేవి ఆలయం వీటితో పాటు మరియు కొంచం దూరంలో వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీ పాదవల్లభ స్వామి ఆలయం కూడా చూడవచ్చు.

 

ఈ పోస్ట్ ఎంతో ఓపికతో చదివినందుకు ప్రతి ఒకరికి పేరు పేరున మరియు ఈ అవకాశం కల్పించిన రాజాచంద్ర అన్నయ్య గారికి ధన్యవాదలు ఇట్లు మీ విధేయుడు డి. బాల్ నర్సింగ్ రావు.

 

Key Words : Kukkuteshwara Swami Temple , Andhra pradesh Famous Temples , Lord Shiva Templels, Kukkuteshwara Swami Temple Timings, Balnarsingrao, Travellers,

 

temples guide bones points

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *