వారణాసిలో నిత్యo పెరిగే శివలింగం | తిలాభాండేశ్వర్ , వారణాసి

వారణాసి తిలాభాండేశ్వర్ స్వామి దేవాలయం

పూర్వం వారణాసి లో నివసించే ఒక శివభక్తురాలికి జరిగిన యదార్ధ సంఘటనకి , నిదర్శమే ఈ తిలాభాoడేశ్వర్ స్వామి చరిత్ర.  ఈ శివభాక్తురాలు నిత్యమూ నువ్వుల నుంచి నూనె తీస్తూ ఉండేది . ఆవిడ భర్త ఆ నూనెను చుట్టుప్రక్కల గ్రామాలకి వెళ్లి అమ్ముతూ ఉండేవాడు . ఆవిడకి నూనె తీయడం తప్ప , బయట ప్రపంచం తో సంబంధమే లేదు. నిత్యమూ నూనె తీస్తూ … శివారాధన చేసేది. శివుడితో మాట్లాడుతూ ఉండేది. శివుడిని ప్రశ్నిస్తూ ఉండేది. ఆవిడ భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ఆవిడకు ప్రత్యక్షమయ్యి , సమాధనమిచ్చేవాడు.

అలా కాలం గడుస్తూ ఉండగా .. ఒక నాడు ఆవిడ భర్త గ్రామము నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ఎంత పిలిచినా తన భార్య పలకలేదని , కిటికీ తెరువగా… ఆయన చూడలేనంత కాంతి ఇంటిని ఆవరించి ఉంది. విషయం తెలుసుకోవాలనుకున్న ఆవిడ భర్త , తలుపులు పగలగొడుతుండగా , ఆవిడ భయం తో ఈశ్వరుడి మీద గంపను బోర్లించింది. ఆవిడ భర్త లోనికి పోయి చూడగా.. భార్య తప్ప ఎవ్వరూ కనపడలేదు… గంప కింద ఎదో ఉందని సందేహించి చూడగా.. బోర్లించిన గంప అంత పరిమాణం లో శివ లింగం సాక్షాత్కారమయ్యింది. మన ఇంట్లో ఈ లింగం ఉదయం లేదు , ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చిందని భార్యను అడగగా .. ఆవిడ నాకేమీ తెలియదనెను. అప్పుడు కోపోద్రేకుడయిన భర్త , నలుగురిని పిలిచి , పంచాయితీ ఏర్పాటు చేసాడు.

అక్కడ ఆమెను నిలదీసి అడుగగా.. ఆవిడ భయం తో.. నేను నిత్యమూ శివారాధన చేస్తుంటాను కదా… ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి , నా సందేహాలను తీరుస్తుంటారు. మీరేమంటారో అనే భయం తో … మీకు కనబడకూడదని ఈశ్వరుడి మీద బుట్టను కప్పి ఉంచాను. మీరు తెరిచేసరికి , లింగాకారం లో దర్శనమిచ్చారు , ఇదే జరిగింది అని , గజ గాజా వణుకుతూ చెప్పింది.. అక్కడున్నవారంతా ఆవిడ భక్తికి ప్రణమిల్లి , అందరూ ఆవిడకు పాదాభివందనం చేసారు, ఆవిడ భర్త క్షమించమని కోరాడు.. అప్పుడు ఆవిడ ఈశ్వరుణ్ణి ప్రార్ధించగా… ఇప్పటి నుండీ, నిత్యమూ నువ్వు గింజంత పరిమాణం చొప్పున ఈ లింగం పెరుగుతుందనీ, తిలాభాoడేశ్వర్ గా ప్రసిద్ధి చెందుతుంది అని వరమిచ్చారట. అప్పటి నుంచీ , ఆ లింగం నిత్యమూ నువ్వు గింజంత పెరుగుతూనే ఉంది.. ఇదే నిశ్చల భక్తికి ఈశ్వరుడు ఇచ్చే నిదర్శనంగా చెప్తారు  కాశీలో .

మీరు వారణాసి వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శిoచండి..

ఓం నమః శివాయ _/\_

Key Words: Thilabhandeswar , Thilabhandeswara swami devalayam , Varanasi tour , Kasi yathra , Kasi near by temples , famous temples in kasi

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *