బాలాత్రిపురసుందరీదేవి స్థలపురాణం | త్రిపురాంతకం

బాలాత్రిపురసుందరీ అమ్మవారి దేవస్థానం – త్రిపురాంతకం

త్రిపురాంతకం లో అమ్మవారు బాలాత్రిపురసుందరీ దేవిగా వెలిసి ఉన్నారు . పరమేశ్వరుడు త్రిపురాంతకేశ్వరుడిగా కొలువై ఉన్నారు . శ్రీశైలానికి తూర్పుద్వారం త్రిపురాంతకం . తిపురాంతకేశ్వర దేవాలయ ప్రాంగణం కింద ఇమేజ్ లో చూడచ్చు.

స్థానికుల నమ్మకం ప్రకారం , పూర్వం సుర , ఆసురుల యుద్ధం జరుగుతున్నప్పుడు , ఒక్కో రక్తపు బొట్టు నుంచి అనేక మంది అసురులు పుట్టుకొస్తున్నారు, రాక్షస గణం పెరుగుతూ , దేవతా గణం క్షీణించసాగారు. దేవతలు యుద్ధం ఓడిపోయే పరిస్థితి వచ్చింది.. అప్పుడు ఆదిపరాశక్తి ని ప్రార్ధించగా ... అమ్మవారు ఉగ్రరూపం దాల్చి , రక్తపు బొట్లు నేలమీద పడకుండా , తన నాలుక ను భూమంతా పరచడం తో , ఆ రక్తపు బొట్లు నేలను తాకకుండా , అమ్మ నాలుక నుంచి , ఉదరభాగం లోకి ప్రవేశించాయి. రాక్షసుల మీద దేవతలు యుద్ధం లో గెలిచారు. అమ్మవారు అలా ఉగ్రరూపం లోనే ఉండిపోయారు. తరువాత అమ్మవారిని ఎంత శాంతింపజేయాలని ప్రయత్నించినా , అమ్మవారు ఉగ్రరూపం లోనే స్థిరం గా ఉండటం తో, ఆగ్రహించిన పరమేశ్వరుడు ,అమ్మవారి చెంప మీద గట్టిగా మందలించగా … అమ్మవారు కోపం తో బావిలోనికి ప్రవేశించారట. ముఖ భాగము మాత్రమే పైకి కనిపించేలా , జుట్టు విరబోసుకుని, ఉగ్ర రూపంతో ఆదిపరాశక్తి అక్కడ బావిలో వెలిసినట్టు స్థానికుల నమ్మకమని , 50 సంవత్సరాల క్రితం ఆలయం లో పనిచేసిన , ఆలయ పూజారి  తెలియజేసారు. 

అలా అసుర లక్షణాలతో , అమ్మ అక్కడ సంచరిస్తున్నట్టు స్థానికుల పురాణం. కాల క్రమేణా , జగద్గురు ఆదిశoకరాచార్యులు త్రిపురాంతకం వచ్చి , అమ్మవారిని శాంతిoపజేసి, అక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించి, బాలాత్రిపురసుందరి గా విరాజిల్లేలా చేసారని కధనం. ఆలయ ప్రాంగణం లోనే  మహిష గుండము ఉంటుంది . అక్కడ మహిషాలను బలి ఇస్తారు.. ఒకేసారి వెయ్యి మహిషములను బలి ఇచ్చినా గుండము నుంచి రుధిరము బైటికి రాదట. తెల్లవారేసరికి ఒక్క రక్తపు బొట్టు కూడా కనపడదట. ఇదంతా త్రిపురాంతకం ఆలయం లో బోర్డు మీద రాసే ఉండేది 4 సంవత్సరాల క్రితం దాకా.. ఇప్పటికీ  మహిష గుండము ఉన్నది .  మహిష గుండాన్ని కింద ఇమేజ్ లో మీరు చూడచ్చు.

నవరాత్రులలో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం నాడు లేత పింక్ రంగు చీర అమ్మవారికి ప్రీతికరం .

ఆశ్వయుజ శుద్ధ విదియ అనగా ,నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.
అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈవిడేమో త్రిపుర సుందరి దేవి…..అయ్య వారు ఏమో త్రిపురాంతకుడు…ఆది దంపతులు…వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే ” మనలోని మూడు అవస్థలూ…జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
ఈ ముడు అవస్థలకు  బాల అధిష్ఠాన దేవత!
ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ….”బాలగా..”….అమ్మవారు వినోస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ మూడు అవస్థలలోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.

అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది….ఆవిడ ఆత్మ స్వరూపురాలు….ఆవిడను పూజిస్తే….ఙ్ఞానము కలిగి .. …తానె శివ స్వరూపము తో…చైతన్యము ప్రసాదించి…మోక్షమునకు…అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది…ఈ కరుణామయి..సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవి భక్తుల పూజలు అందుకుంటోంది.
దసరా నవరాత్రులలో , బాలా త్రిపురసుందరీ అలంకారం నాడు , రెండు నుండి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. ఆ రోజున అమ్మవారికి  పాయసం నివేదన చెయ్యాలి.

ఓం శ్రీమాత్రే నమః _/\_

Key words: Thripuranthakam , Balathripurasunadri devi , Srisailam Tour , Srisailam Near By temples , Baalaarchana, Balathripurasundari Devasthanam

temples guide bones points

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *