Srisailam Sri Bhramaramba Devi Shakthi Peeth Information

[vc_row][vc_column width=”5/6″][vc_column_text]అష్టాదశ శక్తిపీఠాలలో
6వ శక్తిపీఠం శ్రీశైలమందు వెలసిన అమ్మ భ్రమరాంబదేవి. శ్రీశైలక్షేత్రం ఆంద్రప్రదేశ్ కి చెందిన కర్నూలు జిల్లాకు 180 కి. మీ దూరంలో ఉంది. హైదరాబాద్ కు 210 కి. మీ దూరంలో కృష్ణా నదీ తీరంలో ఉంది. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానంగా పేరు పొందింది. శ్రీశైలం ఒక లోతైన అడవిలో నల్లమల కొండలలో ఉంది.
ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత:
ఇక్కడ సతీదేవి మెడభాగం పడినట్లు పురాణగాథ. ఈ అమ్మవారిని ఆదిశంకరుల వారు సేవించారు. అమ్మవారి విగ్రహము స్దానభంగిమలో నిలబడినట్లుగా మలచబడినది. భ్రమరాంబిక దేవి అష్టభుజములు కలిగి ఉంది. కుడివైపున శూలాన్ని, ఖడ్గం, బాకు, చక్రమును, ఎడమవైపు గద, విల్లు, శంఖమును, కుడివైపు భుజమున అమ్ములపొదిని ధరించి ఉంది. 


ఈ క్షేత్రమందు చూడవలసిన గుళ్ళు, గోపురాలు, మఠాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఇంద్రాదిదేవతలు భ్రమరాంబికాదేవిని శ్రీశైలంలో కొలువుదీరమని ప్రార్ధించిరి. దేవి వారి ప్రార్ధనల కొరకు ఆమె అక్కడే స్థిరనివాసం చేయవలెనని సంకల్పించెను. తనకు అనువైన ప్రదేశమును వెతుకుచుండగా మల్లె పాద వాసన రావడంతో సమీపంలో మల్లికార్జున జ్యోతిర్లింగం కనిపించింది. అదే తనకు తగిన స్థలమని భావించింది. అశ్విజమాసంలో నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
పూర్వం అరుణాసురుడు అనే  రాక్షసుడు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్దించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమి చేయలేరని చెపుతుంది. తరవాత దేవతలు పథకం ప్రకారం బృహస్పతిని అరుణాసురుని దగ్గరకు పంపిస్తారు. అరుణాసురుడు బృహస్పతి రాకను అడగగా ఇద్దరం ఒకే అమ్మవారిని పూజిస్తున్నాం అని చెప్పడంతో అరుణాసురుడు అమ్మవారిని పూజించడం మానేసాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమరరూపం ధరించి అసాంఖ్యంగా భ్రమరాలని సృష్టించి అరుణాసురిని సైన్యాన్ని సంహరిస్తారు.
ఇక్కడ చూడాల్సిన ఆలయాలు:శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదువందల వరకు శివలింగాలు ఉంటాయి. శ్రీశైలం దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. మనోహరగుండం, నాగప్రతిమలు,పంచపాండవల దేవాలయాలు , అద్దాలమండపం,వృద్ద మల్లికార్జునలింగం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ గోపురం, శ్రీశైలప్రాజెక్ట్ ఇంకా గుళ్ళు,గోపురాలు , మఠాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి.[/vc_column_text][/vc_column][vc_column width=”1/6″][vc_single_image image=”286″ img_size=”full”][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_wp_posts number=”5″][/vc_column][/vc_row]

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *