Sri Chamudeswaridevi Sakthipeetam Temple Information

[vc_row][vc_column][vc_column_text]శ్రీ చాముండేశ్వరిదేవి శక్తిపీఠం (మైసూర్,కర్ణాటక ):

మనదేశంలో అష్టాదశశక్తీ పీఠాలలో నాల్గవ శక్తిపీఠంగా చెప్పబడినది శ్రీ చాముండేశ్వరి శక్తీ పీఠం. కర్ణాటకలోని మైసూర్ లో  ఉన్న శక్తిపీఠం శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం.

ఈ క్షేత్రం ప్రాముఖ్యత:ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడిన స్థలం. భక్తులు ఎక్కువగా ఇక్కడకు వచ్చిఅమ్మవారిని దర్శించుకొంటారు. ఈ ఆలయంలో వైభవంగా  దసరా ఉత్సహావాలు చేస్తారు.విజయదశమి రోజు మైసూరు లో అమ్మవారి ఉరేగింపుజరుగుతుంది.  దేశవిదేశాల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి ఈ ఉత్సహవాలను తిలకిస్తుంటారు. ఈ ఆలయానికి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. అలాగే రహదారి మార్గం ఉంది. ఇక్కడఉన్నఆలయలు : చాముండేశ్వరీఆలయం ప్రాంగణంలో గాలిగోపురం,గణపతి,ఆంజనేయస్వామి,శివలింగం వంటి మందిరాలు ఉన్నాయి. ఈ కొండపై 12 నంది విగ్రహాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి.మహిషాసురుని విగ్రహం కూడా ఈ అమ్మవారి ఆలయానికి ఎదురుగా వుంటుంది. పూర్వం  ఈ నగరాన్ని మహిషపురం అనేవారు క్రమంగా ఇది మైసూరుగా పిలువబడుతోంది.మైసూర్ అనే పేరుతోనే మైసూర్పాక్, మైసూరుసిల్క్ మైసూర్ పెయింటింగ్ ,ప్రాముఖ్యత పొందడం జరిగింది. మైసూర్ రాజులు,విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఇక్కడ చూడవలిసిన ప్రదేశాలు:మైసూరుప్యాలస్, మైసూరుకరాంజిసరస్సు,మైసూర్ విశ్వవిద్యాలయ కార్యకలాపాల్ని పర్యవేక్షించే క్రాఫోర్ట్ హల్,మైసూర్ రైల్వేస్టేషన్ ప్రాగణం,సెయింట్ ఫలోమేనన్ చర్చి.[/vc_column_text][/vc_column][/vc_row]

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *