singlepost

VANGALAPUDI SIVAKRISHNA
3 month(s) ago

SRUNGARA VALLABHA SWAMY TEMPLE

SRUNGARA VALLABHA SWAMY TEMPLE is Located in Chadalada, East Godavari District from Andhra Pradesh State. It is one of the Nava Tirupathi Temples. This temple is above 1000+ years old .

తొలితిరుపతిగా ప్రసిద్ధి చెందిన - చదలాడ తిరుపతి విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు .. స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి ఆలయ చరిత్ర / స్థల పురాణం : అవ్యతుడు శాశ్వతుడు అయిన పరమాత్మ నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు బ్రహ్మనుండి స్వాయంభువ మనువు స్వాయంభువ మనువు నుండి ఉత్తానపాదుడు జన్మించారు ఉత్తానపాదునికి సునీత సురుచి అనే ఇద్దరు భార్యలు సునీత కుమారుడు ధృవుడు సురుచి కుమారుడు ఉత్తముడు ఉత్తాన పాదునికి సురుచి మరియు ఉత్తములంటేనే మిక్కిలి ఇష్టం ఒకరోజు ఉత్తాన పాదుడు ఉత్తముడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉండగా తానూ కూడా తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలని అనుకుంటాడు కానీ ఉత్తానపాదుడు ధృవుడి కోర్కెను తీర్చడు అతని సవతి తల్లి అయిన సురుచి మీ తండ్రి ఒడిలో ఆడుకోవాలంటే నా కడుపున పుట్టిన వాడై ఉండాలి అని అవమానకరం గా మాట్లాడుతుంది. ఆ మాటలకు దుఃఖిస్తున్న ధ్రువుడిని తల్లి సునీతి దగ్గరకు తీసుకుని నాయనా దృవ కుమారా తండ్రి ఒడిలో నీవు ఆదుకోవాలన్న, నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలన్నా శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట. అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా ఆ ముని \\\" నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి\\\" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట. ఆ మహాముని చెప్పినట్లే \\\"దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట\\\" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా) ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం) శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామీ వారికి నిరోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, ఆమనోత్సవ, సంవత్సరోత్సవాలు నేటికీ శ్రీ శాస్త్రము, జౌఖేయన సూత్రం, యజుశ్శాఖయంగా చెప్పబడే శ్రీ వైఖానస భగవశాస్త్రము అనుసరించి నిర్వహించబడుతుండడం విశేషం ఆలయ విశిష్టత : 1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం ) 2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది ) 3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి 4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. 5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది. 6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ 7) రెండు ప్రాకారాల దేవాలయం కలిగి ఉండి ఆలయం నాలుగు వైపులా నుండి లోనికి రావడానికి అవకాశం 8) వరుసగా 5 ద్వారాలు కలిగి ఉండడం మరియు స్థంబాలు ఏ ఒక్కటీ మరో స్తంభంలా ఉండదు 9) 13 వ శతాబ్దం లో ప్రతిష్టించిన 12 మంది ఆళ్వారులను కలిగి ఉండటం కార్యక్రమాలు - పూజా విధానం : 1) నిత్య ధూప దీప నైవేద్యం 2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం 3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు 4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 5) ప్రతీ శనివారం అన్నదానం చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు : బోజమహా రాజు బట్టీ విక్రమార్క రాణీ రుద్రమదేవి శ్రీ కృష్ణ దేవరాయలు పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు లక్ష్మీ నరసాపురం జమీందారులు

Previous picture Next picture Close gallery

Temples guide

Wow.. superb sir.. thank you for sharing Comment

VANGALAPUDI SIVA KRISHNA

Thank You @Temples guide Comment

Bagundi sir Comment

Nepal Muktinath Yatra

Nepal Muktinath kashi Yatra[6 Days] ex Kathmandu/Sonauli/Kashi Fixed Departure Date March 24 April 17,27 May 5,15 Inclusion:[In Nepal] 1:All Veg Meals 2:All travelling 3:Hotel Night Stay 4:Muktinath Temple Darshan by flight/Road **Kailash Mansarowar Yatra Best Rate Available Call/Whatsapp +91-9198595775 Comment

x
Make a Post
  

* You get one point for filling each field. Points will be applicable for the logged in users only.

x
Write a Comment
x
Write a Comment
x
Edit Info
 

Ask Your Questions / Share Your Knowledge

  • Today Panchangam
  • TTD Panchangam